కుట్ర రాజకీయాలను ప్రజలకు తెలపాలి...  

కుట్ర రాజకీయాలను ప్రజలకు తెలపాలి...  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవడానికి... ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం నెంబర్-1లో ఉండటానికి చంద్రబాబు నాయుడే కారణమన్నారు టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్. ఈరోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. 1500 రోజుల్లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఎవ్వరూ చేయలేనన్ని అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. గ్రామదర్శిని ద్వారా 75రోజులపాటు ప్రజల్లో ఉండే కార్యక్రమానికి రూపకల్పన చేశామని తెలిపారు. నాలుగేళ్ల కాలంలో ఇరిగేషన్ కు రూ.50వేల కోట్లు ఖర్చు పెట్టామని వివరించారు. కుట్ర రాజకీయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని.. విభజన హామీలపై ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవాలని కళా వెంకట్రావ్ వివరించారు.