వెస్టిండీస్‌కు భారీ షాక్‌..! 

వెస్టిండీస్‌కు భారీ షాక్‌..! 

ప్రపంచ కప్‌ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉన్న వెస్టిండీస్‌కు మరో ఎదురుదెబ్బ తగలింది. మోకాలి గాయం కారణంగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రే రసెల్‌ టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన రసెల్‌.. ఇప్పుడు ఏకంగా వరల్డ్‌కప్‌కే దూరమయ్యాడు. రసెల్‌ స్థానంలో సునీల్ అంబ్రిస్‌ని జట్టులోకి తీసుకుంటున్నట్టు విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది.