రసెల్‌ ఎలా ప్రాక్టీస్‌ చేస్తాడో తెలుసా..?

రసెల్‌ ఎలా ప్రాక్టీస్‌ చేస్తాడో తెలుసా..?

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విండీస్‌ విధ్వంసకర ఆటగాడు ఆండ్రూ రసెల్‌ ఎలా ప్రాక్టీస్‌ చేస్తాడు? క్రీజ్‌లోకి వస్తే ఫోర్లు, సిక్సర్లతోనే డీల్‌ చేస్తున్న ఈ కరీబియన్‌ క్రికెటర్‌.. బంతిని అలవోకగా ఎలా బౌండరీని దాటించగలుగుతున్నాడు? ఇదే విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో రసెల్‌ను అడగ్గా.. అది చెప్పడం సాధ్యంకాదని.. బ్యాటిచ్చి గ్రౌండ్‌లోకి పంపిస్తే బంతిని బలంగా ఎలా బాదాలో చూపిస్తానని జవాబిచ్చాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లోనూ రసెల్‌ ప్రతి బంతినీ సిక్సర్లే లక్ష్యంగా కొడతాడట..! కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ షేర్‌ చేసిన ఓ వీడియో చూస్తే ఇది నిజమేనేమో అనిపిస్తోంది. ఈ వీడియోలో.. ఈడెన్‌ గార్డెన్స్‌లో టీమ్‌తో కలిసి ప్రాక్టీస్‌ చేస్తున్న రసెల్‌.. భారీ సిక్సర్లతోపాటు చూడచక్కని కట్‌ షాట్లను కోట్టాడు. ఆ వీడియోను మీరూ చూడండి...