అందుబాటులో ఆండ్రాయిడ్ పి బీటా..!

అందుబాటులో ఆండ్రాయిడ్ పి బీటా..!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ కొత్త ఆండ్రాయిడ్ వర్షన్ ను విపణిలోకి విడుదల చేసింది.  ఇది బీటా వర్షన్ గా విడుదలైన ఆండ్రాయిడ్ పి కొన్ని కంపెనీల మొబైల్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. చిన్న చిన్న సాంకేతిక లోపాలను సవరించిన తరువాత పూర్తి స్థాయిలో ఈ వర్షన్ ను రిలీజ్ చేస్తారు.  ప్రస్తుతం మనకు ఆండ్రాయిడ్ 8.1 ఒరియో వర్షన్ అందుబాటులో ఉన్నది.  
చాలా కాలం నుంచి ఆండ్రాయిడ్ పి వర్షన్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నా.. వివిధ సాంకేతిక కారణాల వలన ఆలస్యం అవుతూ వస్తున్నది.  ఇప్పటికే ఆలస్యం కావడంతో మొదటగా బీటా వర్షన్ ను రిలీజ్ చేయాలని, కొంతకాలం తరువాత ఒరిజినల్ వర్షన్ ను విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.  గూగుల్ ఫిక్సిల్ డివైజ్ లలోను, హెచ్.టి.సి, సోనీ వంటి మరో 7 ఇతర డివైజ్ లలోను ఆండ్రాయిడ్ పి బీటా వర్షన్ అందుబాటులో ఉంటుంది.