వ్యాక్సిన్‌ ఎఫెక్ట్..! వరంగల్‌లో అంగన్‌వాడి కార్యకర్తకు తీవ్ర అస్వస్థ..!

వ్యాక్సిన్‌ ఎఫెక్ట్..! వరంగల్‌లో అంగన్‌వాడి కార్యకర్తకు తీవ్ర అస్వస్థ..!

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతూనే ఉంది.. అయితే, వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కొందరు అక్కడక్క అస్వస్థతకు గురవుతున్నారు.. కొన్ని ప్రాంతాల్లో ప్రాణాలు సైతం పోతున్నాయి... తాజాగా వరంగల్‌లో ఓ అంగన్‌వాడీ కార్యకర్త తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. వరంగల్ లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న జ్యోతి అనే అంగన్ వాడి కార్యకర్త గుండెనొప్పితో తీవ్ర అస్వస్థత గురయ్యారు... వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు.. అయితే, సమాచారం అందించినా.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు జ్యోతి కుటుంబసభ్యులు. కాగా, వ్యాక్సినేషన్‌ తర్వాత కొందరు అస్వస్థతకు గురికావడం.. మరికొందరు ప్రాణాలు కోల్పోవడంతో వ్యాక్సినేషన్‌ అంటేనే కొంతమంది వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. మరోవైపు.. ఇప్పటికే వరంగల్‌ జిల్లాలో మరో అంగన్‌వాడీ కార్యకర్త మృతిచెందిన సంగతి తెలిసిందే.