మాథ్యూస్‌ సూపర్‌ సెంచరీ.. టీమిండియా టార్గెట్‌ ఇదీ..

మాథ్యూస్‌ సూపర్‌ సెంచరీ.. టీమిండియా టార్గెట్‌ ఇదీ..

వరల్డ్‌కప్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంక అద్భుత పోరాట పటిమ చూపించింది. 55 పరుగులకే 4 వికెట్ల కోల్పోయినా మాథ్యూస్‌ (113: 128 బంతుల్లో.. 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్‌ సెంచరీ చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 264 పరుగులు చేయగలిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్వింగ్‌ కింగ్‌ బుమ్రా.. ఓపెనర్లు కరుణరత్నె(10), పెరీరా(10)లను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపించాడు. 

ఆ తర్వాత వచ్చిన ఫెర్నాండో(20), మెండిస్‌(3) కూడా నిరాశపరిచారు. ఈ దశలో తిరిమన్నె(53)తో కలిసి మాథ్యూస్‌ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివర్లో ధనంజయ డిసిల్వా (29) రాణించడంతో టీమిండియాకు శ్రీలంక మంచి టార్గెట్‌ను నిర్దేశించింది. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. పాండ్యా, కుల్దీప్‌, జడేజా, భువనేశ్వర్‌లు చెరో వికెట్‌ తీశారు.