భార్యపై కోపంతో 280 మైళ్ళు నడిచిన భర్త... చివరకు 

భార్యపై కోపంతో 280 మైళ్ళు నడిచిన భర్త... చివరకు 

సాధారణంగా భార్యపై కోపం ఉంటె నాలుగు  తిడతారు లేదంటే రెండు దెబ్బలు వేస్తారు.  కోపం తగ్గకపోతే  కొన్ని రోజులు మాట్లాడకుండా ఉంటారు.  కానీ, ఓ వ్యక్తి మాత్రం అందుకు విరుద్ధంగా భార్యపై కోపంతో ఇల్లు వదిలి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.  అతను అలా 280 మైళ్ళదూరం నడిచాడట.  అయితే, 280 మైళ్ళ దూరంలో  నగరంలో కర్ఫ్యూ ఉండటంతో  పోలీసులు అతడిని పట్టుకున్నారు. భార్యపై ఉన్న కోపంతో 280 మైళ్ళ దూరం నుంచి నడుచుకుంటూ  వస్తున్నట్టు పోలీసులకు తెలిపాడు.  పోలీసులు ఆ  విషయాలను నమ్మలేదు.  పోలీసుల విచారణలో అతను చెప్పింది నిజం అని తేలింది.  భార్యపై కోపంతో ఇటలీలోని కొమో పట్టణం నుంచి ఫానో పట్టణానికి నడుచుకుంటూ వచ్చాడని తేలింది.  వారం రోజుల నుంచి తన భర్త కనిపించడం లేదని అతని భార్య పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు అతడిని భార్యకు అప్పగించారు.