జైలు శిక్ష తప్పించుకున్న అనిల్ అంబానీ

జైలు శిక్ష తప్పించుకున్న అనిల్ అంబానీ

రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్ కామ్) చైర్మన్ అనిల్ అంబానీ మూడు నెలల జైలు శిక్షను తృటిలో తప్పించుకొన్నారు. స్వీడన్ కి చెందిన టెలికామ్ పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ కు బకాయిపడ్డ మొత్తాన్ని ఆర్ కామ్ చెల్లించేసింది. అనిల్ అంబానీ నియంత్రణలోని ఆర్ కామ్ ఇవాళ ఎరిక్సన్ కి చెల్లించాల్సిన రూ.462 కోట్ల బకాయిలను ఇచ్చేసింది. మార్చి 19, 2019ని కోర్టు చెల్లింపునకు తుది గడువుగా నిర్ణయించగా ఆర్ కామ్ ఇవాళే తమకు చెల్లింపులు జరిపినట్టు ఎరిక్సన్ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో రెండు కంపెనీల మధ్య ఏడాదిగా సాగుతున్న న్యాయ పోరాటం ముగిసింది.