మోడీ తరఫున అనిల్‌ రాయబారం?

మోడీ తరఫున అనిల్‌ రాయబారం?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో వీరిద్దరూ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల గురించి వీరిద్దరూ భేటీ అవుతున్నారని అధికారిక వర్గాలు అంటున్నా.. రేపు కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రం నుంచి వైదొలగిన తరవాత మోడీపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని పిలుపు ఇచ్చారు. అనిల్‌ అంబానీ అన్న ముకేష్‌ అంబానీ భేటీ తరవాత చంద్రబాబు వైఖరిలో పూర్తి వచ్చినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. బాబు, ముకేష్ భేటీ తరవాతే మోడీపై బాబు దాడి తీవ్రం చేశారు. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితులైన పారిశ్రామికవేత్తల్లో అనిల్‌ అంబానీ ఒకరు. రాఫెల్‌ డీల్‌ విషయంలో మోడీ-అనిల్ బంధంపై కాంగ్రెస్‌ ఇప్పటికే తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే పక్షంలో మోడీ వ్యతిరేక వర్గం మరింత బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబు-అనిల్‌ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మోడీ తరఫున అనిల్‌ అంబానీ రాయబారం నెరుపుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.