రిలయన్స్‌ను మేము ఎంచుకున్నాం

రిలయన్స్‌ను మేము ఎంచుకున్నాం

రఫెల్‌ విమానాల తయారీ కోసం భారత భాగస్వామిని తామే ఎంచుకున్నామని ఫ్రాన్స్‌ కంపెనీ దసాల్ట్‌ స్పష్టం చేసింది. ఇందులో ప్రభుత్వాల పాత్ర లేదని కంపెనీ ఓ పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. రఫెల్‌ డీల్‌ భారత్, ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య కుదరిన ఒప్పందమని, అయితే ఆఫ్‌సెట్‌ కింద భారత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ తనకు ఉందని దసాల్ట్ పేర్కొంది.రఫెల్‌ ఒప్పందం కోసం రిలయన్స్‌ డిఫెన్స్‌ గ్రూపు పేరును భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందని హోలన్‌ చెప్పినట్లు మీడియాపార్ట్‌ పేర్కొంది. తమకు మరో అవకాశం లేకపోవడం వల్లే మోడీ ప్రభుత్వం సిఫారసు చేసిన భాగస్వామిని తీసుకున్నాం అని హోలన్‌ చెప్పినట్లు తెలిపింది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రభుత్వం కూడా
అనిల్‌ అంబానీ కంపెనీ ఎంపిక విషయంలో తమ పాత్ర ఏమీ లేదని ఫ్రాన్స్‌ ప్రకటించింది. ఒప్పందాల్లో భారత సంస్థలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఫ్రెంచి కంపెనీలకు ఉంటుందని ప్రభుత్వ ప్రతినిధి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.  ‘భారత ప్రభుత్వం ప్రతిపాదించిందని మేం కంపెనీలను భాగస్వాములుగా ఎంచుకోం. రాఫెల్‌ ఒప్పందంలో మా పాత్ర  ఏమీ లేదు. ఒప్పందాల కోసం సంస్థలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఫ్రాన్స్‌ కంపెనీలకు ఉంటుంది. ఏ సంస్థకు సామర్థ్యం ఉందని భావిస్తే వాటినే మా కంపెనీలు ఎంచుకుంటాయి. అప్పుడు భారత ప్రభుత్వ అనుమతిని కోరుతాయి’ అని ఆ ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత చట్టాలకు అనుగుణంగానే రఫెల్‌ ఒప్పందాలు జరిగాయని అందులో తెలిపింది.  రఫెల్‌ ఒప్పందంపై మాజీ అధ్యక్షుడు హోలన్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో  ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ ప్రకటన జారీ చేసింది.