ఆస్థులు అమ్మి అప్పులు తీరుస్తా: అనిల్ అంబానీ

ఆస్థులు అమ్మి అప్పులు తీరుస్తా: అనిల్ అంబానీ

అనిల్ అంబానీ నిర్వహిస్తున్న రిలయన్స్ కామ్ సంస్థ కోసం తీసుకున్న అప్పులు తీర్చలేక తమ ఆస్తులను అమ్మి రూ.42వేల కోట్లు చెల్లించాలని భావిస్తున్నారు. అదికూడా 270 రోజుల్లో చెల్లిస్తానని అనిల్ అంబానీ చెబుతున్నారు. గత సంవత్సరంలోగా చెల్లిస్తానని చెప్పి చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  గత ఏడాదిన్న కాలంగా రుణాలు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించలేకపోయినట్లు బోర్డు తెలిపింది. దీంతో ఇక అప్పులు తీర్చలేమనే నిర్ణయానికి వచ్చేశామని ఇందుకోసమే ఆస్తులను అమ్మకాలకు పెట్టినట్లు ఆర్‌కాం బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. 

అంతేకాదు పలు న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో ఆర్‌కాంకు సంబంధించి రూ.18వేల కోట్లు ఆస్తులను అమ్మలేకపోతోందని ప్రకటనలో తెలిపింది. దీనిపై భారతదేశం విదేశాలకు చెందిన 40కి పైగా రుణదాతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ఆస్తులు అమ్మేందుకు వీలుపడలేదని స్పష్టం చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చైనా డెవలప్‌మెంట్, యూనియన్ బ్యాంక్, కెనారా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, స్టాండర్డ్ ఛాటర్డ్ బ్యాంక్, హెచ్ఎస్‌బీసీ బ్యాంకులు రుణాలు ఇచ్చిన వాటిలో ఉన్నాయి. 

అప్పు చెల్లించేందుకు గాను ఆర్‌కాం సంస్థ ముందుగా 122.4 మెగా హెడ్జ్ స్పెక్ట్రం, మరియు 43వేల టెలికాం టవర్స్‌ను రిలయన్స్‌ సంస్థ జియోకు , కొంత రియల్ ఎస్టేట్ కెనడాకు చెందిన బ్రుక్‌ఫీల్డ్ సంస్థకు అమ్మాలని భావించింది. అయితే కోర్టుకు వెళ్లాలన్న నిర్ణయం కంపెనీ తీసుకోవడంతో ఇప్పుడు ఆ యోచన విరమించుకుంది. అయితే ఇప్పటికే నోడ్స్, మరియు ఫైబర్‌ రూ. 5వేల కోట్లకు అమ్మివేసింది. ఇక కోర్టు కంపెనీ సమస్యను పరిష్కరించి అది కొద్ది రోజుల పాటు పనిచేసేలా కొందరి నిపుణులను అపాయింట్ చేస్తుంది. అంతేకాదు ఆస్తులు అమ్మేందుకు జరిగే బిడ్డింగ్‌ను వీరు పరిశీలించి మిగతా ఆస్తులు 270 రోజుల్లో అమ్ముడుపోయేలా చర్యలు తీసుకుంటారు.