ఏపీ హైకోర్టులో చంద్రబాబుపై పిటిషన్

ఏపీ హైకోర్టులో చంద్రబాబుపై పిటిషన్

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ రిపబ్లిక్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్ కుమార్ పిటిషన్ వేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ పథకాల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు సొంత ఖర్చు కింద ఆ నిధులను జమ చేయాలంటూ అనిల్‌ కుమార్‌ కోరారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది.