కామెంట్ వరకే..! బుద్దా వెంకన్న ఆత్మహత్య చేసుకోరు..!

కామెంట్ వరకే..! బుద్దా వెంకన్న ఆత్మహత్య చేసుకోరు..!

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కామెంట్లపై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టిలో పడేందుకే బుద్దా వెంకన్న ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రకటన చేశారని ఎద్దేవా చేశారు. తన కోసం ఆత్మహత్య చేసుకుంటున్నారని చంద్రబాబు తనకు ప్రమోషన్ ఇస్తారని బుద్దా వెంకన్న భావించి ఉంటారంటూ పంచ్‌లేశారు మంత్రి. అయితే, వాస్తవాల ఆధారంగా రాజకీయం చేయాలి.. కానీ, సంచలనం సృష్టించే కామెంట్లు ఏంటన్న ఆయన.. ఏదో కామెంట్ చేస్తారు.. కానీ, బుద్దా వెంకన్న నిజంగా ఆత్మహత్య చేసుకోరనే విషయం అందరికీ తెలిసే అందున్నారు అనిల్ కుమార్ యాదవ్.