స్క్రిప్ట్ పూర్తిచేసిన అనిల్ రావిపూడి !

స్క్రిప్ట్ పూర్తిచేసిన అనిల్ రావిపూడి !

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తర్వాతి సినిమాను అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే.  గత కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం స్క్రిప్ట్ రాస్తున్న అనిల్ రావిపూడి ఇటీవలే దాన్ని ముగించేశాడు.  దీంతో లొకేషన్లను వెతికే పనిలో పడ్డాడు.  వీరి సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నెలలో మొదలుకానుంది.  పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రం ఉండనుంది.  హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.  ఇకపోతే సినిమాకు 'సరిలేరు నీకెవ్వరూ, రెడ్డిగారి అబ్బాయి' వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.