ఎఫ్-3 లో మూడో హీరో పై క్లారిటీ ఇచ్చిన అనిల్...

ఎఫ్-3 లో మూడో హీరో పై క్లారిటీ ఇచ్చిన అనిల్...

వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలు గా నటించిన ఎఫ్ 2 తెలుగులో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. సినిమాలో వారిద్దరి కామెడీ టైమింగ్ ప్రజలను ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడంతో దీనికి సీక్వెల్ గా ఎఫ్ 3 తీయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి ఆ సినిమా కి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ సమయం లో బయట సినిమాకు సంబంధించి ఓ పుకారు చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే... ఈ సినిమాలో మరో హీరో కూడా ఉన్నాడని ఆ స్థానంలో చాల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ విషయం పై దర్శకుడు అనిల్ స్పందించాడు. ఈ సినిమాలో మూడో హీరో ఉంటాడో లేదో స్క్రిప్ట్ పూర్తిగా రాసిన తరువాత తెలుస్తుంది. అలాగే ఎఫ్ 2 లో నటించిన తమన్నా, మెహ్రీన్ ఎఫ్ 3 లో ఉండరు అనే వార్తలలో కూడా నిజం లేదు. ఎఫ్ 3లో కూడా వారే హీరోయిన్స్ గా చేస్తారు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే అంతకముందు ఈ సినిమా షూటింగ్ ను ఆగస్ట్ లో మొదలుపెట్టాలని దిల్ రాజు అనిల్ కి చెప్పారట... కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. చుడాలి మరి ఏం జరుగుతుంది అనేది.