రెమ్యునరేషన్ భారీగా పెంచిన రావిపూడి !

రెమ్యునరేషన్ భారీగా పెంచిన రావిపూడి !

'ఎఫ్ 2' విజయంతో దర్శకుడు అనిల్ రావిపూడి ఇమేజ్ బాగా పెరిగిపోయింది.  హాస్యభరితమైన సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేయడంలో దిట్ట అనే పేరు తెచ్చుకున్నాడు.  దీంతో అలాంటి సినిమాలు చేయాలనుకునే  హీరోలు, నిర్మాతలు రావిపూడి వైపు చూస్తున్నారు.  మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పిలిచి మరీ అతనికి అవకాశం ఇచ్చాడంటే అతని క్రేజ్ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.  అందుకే రావిపూడి కూడా తన రెమ్యునరేషన్ బాగా పెంచాడట.  ప్రస్తుతం మహేష్ బాబుతో చేయనున్న సినిమా కోసం ఆయన సుమారు 10 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.  ఈ సినిమా కూడా విజయం సాధిస్తే 10 కోట్లు 12 నుండి 13 కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.