తెలుగు ప్రజల కోసం వార్నర్ టిక్ టాక్ ప్రీమియర్ లీగ్...

తెలుగు ప్రజల కోసం వార్నర్ టిక్ టాక్ ప్రీమియర్ లీగ్...

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా సంక్షోభం అంతటా క్రీడా కార్యకలాపాలను నిలిపివేయడానికి దారితీసింది. అయితే ఈ వైరస్ కారణంగా భారతీయుల క్రికెట్  పండుగ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా తదుపరి నోటీసు వచ్చే వరకు వాయిదా పడ్డింది. అందువల్ల ఐపీఎల్ లో అలరించే ఆటగాళ్లు ఇంట్లో ఉండవలసి వస్తుంది. అయితే లాక్ డౌన్ లో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్మాన్ సన్ రైజర్స్ హైదరాబాద్  కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడు అలాగే టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇదివరకు బన్నీ , ఎన్టీఆర్ పాటలకు స్టెప్పులేసిన వార్నర్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలోని "మైండ్ బ్లాక్ " పాటకు స్టెప్పులేసి అదరగొట్టాడు. అయితే ఆ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ వీడియో పై స్పందించాడు. ''ఈ సంవత్సరం ఐపీఎల్ జరగకపోయినా డేవిడ్ వార్నర్ మమ్మల్ని అలరిస్తూనే ఉన్నాడు. ఈ సంవత్సరం, ఐపీఎల్ మా తెలుగు ప్రజల కోసం డబ్ల్యుటిపీఎల్ (వార్నర్ టిక్టోక్ ప్రీమియర్ లీగ్) గా మారింది'' అని తన ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. అయితే దీని పైనే ఇంతకముందు హీరోయిన్ రష్మిక కూడా స్పందించిన విషయం తెలిసిందే.