ఎఫ్ 2 డైరెక్టర్ తో మహేష్ సినిమా..!!

ఎఫ్ 2  డైరెక్టర్ తో మహేష్ సినిమా..!!

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఎఫ్2 సినిమా ఎలాంటి హిట్ సాధించిందో చెప్పక్కర్లేదు.  పూర్తి స్థాయిలో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వందకోట్లకు పైగా కలెక్ట్ చేసింది.  ఎఫ్2 సినిమాకు సీక్వెల్ చేయాలని నిర్మాత, దర్శకుడు భావిస్తున్న సంగతి తెలిసిందే.  

ఇదిలా ఉంటె, ఎఫ్2 దర్శకుడు అనిల్ రావిపూడి టాలీవుడ్ ప్రిన్స్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.  అనిల్ కథ మహేష్ కు బాగా నచ్చిందని, పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నాడని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.