మహేష్ మాట కోసం డైరెక్టర్ ఎదురుచూపులు !

మహేష్ మాట కోసం డైరెక్టర్ ఎదురుచూపులు !

ఈ ఏడాది ఇండస్ట్రీకి తొలి హిట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి.  ఆయన డైరెక్ట్ చేసిన 'ఎఫ్ 2' చిత్రం ఘన విజయాన్ని అందుకుంది.  ఈ విజయంతో అనిల్ హాట్ షాట్ డైరెక్టర్ అయిపోయాడు.  ఆయనతో సినిమా చేసేందుకు చాలామంది హీరోలు సిద్ధంగా ఉన్నారు.  అయితే ఆయన మాత్రం మహేష్ బాబు కోసమే ఎదురుచూస్తున్నాడు.  

'ఎఫ్ 2' సినిమా చూసిన మహేష్ బాబు కలిసి సినిమా చేద్దామని అనిల్ రావిపూడితో అన్నాడు.  దీంతో అనిల్ మహేష్ కోసం కథను సిద్ధం చేసుకుని కూర్చుకున్నాడు.  అయితే మహేష్ బాబు నుండి మాత్రం ఇంకా పూర్తిస్థాయి కన్ఫర్మేషన్ రాలేదట.  ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న 'మహర్షి' తరవాత సుకుమార్, సందీప్ వంగ వంటి దర్శకులు ఆయన జాబితాలో ఉన్నారు.  అందుకే ఎటూ తేల్చలేకపోతున్నారట.