జగన్ ని, ఆయన మంత్రివర్గాన్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలి : అనిత 

జగన్ ని, ఆయన మంత్రివర్గాన్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలి : అనిత 


మానసిక వైద్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ ను తెలుగు మహిళ అధ్యాక్షురాలు వంగలపూడి అనిత, టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఈరోజు పరామర్శించారు. సుధాకర్ తల్లి ఉదయం నాకు ఫోన్ చేసి డాక్టర్ రామిరెడ్డి వలన సుధాకర్ కు హాని ఉందని అన్నారని అనిత అన్నారు. నాకు రక్షణ లేదు, ప్రాణహాని ఉందని డాక్టర్ సుధాకర్ చెబుతున్నారని అనిత తెలిపారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, అతని మంత్రి వర్గాన్ని పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాలని ఆమె పేర్కొన్నారు. అంతే కాక ఆసుపత్రిలో పెట్టక కూడా డాక్టర్ సుధాకర్ కు మాస్క్ లు ఇవ్వడం లేదని అనిత మండిపడ్డారు.

ఇక హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడం సీఎం జగన్మోహన్ రెడ్డికి కొత్తమీ కాదని, రోజు వారీ మొట్టికాయల్లో ఇది ఒకటని అనిత అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి కులాన్ని అపాదించడం దారుణమన్న ఆమె ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా, జగన్ సర్కార్ చలించడం లేదని మండిపడ్డారు. చేతిలో అధికారం, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని నిరంకుశ వెళ్తే ఫలితం ఇలాగే ఉంటుందని, అధికారంలోకి వచ్చాక ఇది రాష్ట్ర ప్రభుత్వానికి 65వ మొట్టికాయని, ముఖ్యమంత్రిని మానసిక ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయాలని అనిత అన్నారు.