నెల్లూరులో ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం..!

నెల్లూరులో ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం..!

ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. అంతర్వేది రథం దగ్ధం ఘటన తరవాత వరుస ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు హిందూ దేవాలయాల్లో మరోవైపు చర్చిల్లో దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. ఇలా వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. దాంతో ఏపిల్ రాజకీయం వేడెక్కింది. ఇక తాజాగా నాయుడుపేట నగర పంచాయతీలోని తుమ్మూరు ప్రాంతంలో ఏడడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని అఘంతకులు ధ్వంసం చేసారు. విగ్రహం తల, తోక భాగంలో పగలగొట్టారు. డీఎస్ఫీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ ను విచారణ నిమిత్తం రప్పిస్తున్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎవరైనా చేశారా? ఆకతాయిల పనా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.