అన్నా హజారే దీక్ష విరమణ

అన్నా హజారే దీక్ష విరమణ

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే దీక్ష విరమించారు. ఆయన మహారాష్ట్రలో లోక్‌పాల్ నియామకం, లోకాయుక్త చట్టం తీసుకురావాలంటూ ఏడు రోజులుగా నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఇద్దరు కేంద్ర మంత్రులు హజారేను కలుసుకుని చర్చలు జరిపారు. అనంతరం ఆయనను దీక్ష విరమించేందుకు ఒప్పించారు.  చర్చలు సంతృప్తికరంగా ఉండటంతో నిరాహార దీక్ష విరమించాలని నిర్ణయించానని హజారే ప్రకటించారు. లోక్‌పాల్ నియామక ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని  ఫడ్నవిస్ తెలిపారు.  కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రంలో లోకాయుక్త చట్టం తీసుకువస్తామంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ గత జనవరి 30న హజారే తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు.