'లోకేష్‌ వల్లే టీడీపీకి రాజీనామా చేస్తున్నా..'

'లోకేష్‌ వల్లే టీడీపీకి రాజీనామా చేస్తున్నా..'

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ లోకేష్‌ వల్లే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని అన్నం సతీష్‌ చెప్పారు. ఎమ్మెల్సీ పదవితోపాటు తెలుగుదేశం పార్టీకి ఆయన ఇవాళ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు, లోకేష్‌లపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 

'లోకేష్ కారణంగానే పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. పార్టీ మీద కానీ, పార్టీ నిర్మాణం మీద కానీ లోకేష్‌కు అవగాహన లేదు. కానీ పార్టీని తన చేతుల్లోకి తీసుకునేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ చంద్రబాబు చేతుల్లో లేదు' అని అన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ లోకేష్ గ్రూపులను ప్రొత్సహిస్తున్నారన్న సతీష్‌.. లోకేష్ పెంచి పోషించిన గ్రూపుల వల్లే గత ఎన్నికల్లో ఓటమి చెందామన్నారు. 

తాను ఎంపిక చేసిన అభ్యర్థులు అసమర్థులను స్వయంగా చంద్రబాబే అంగీకరించారని.. ఆయణ్ను చూసి ఓటు వేయాలని కోరారని సతీష్‌ గుర్తు చేశారు. ఫలానా అభ్యర్థికి ఓటేయమని చంద్రబాబు గత ఎన్నికల్లో ఎక్కడా అడగలేదన్న ఆయన.. చంద్రబాబే అలా చెబితే పార్టీకి ఇంకెవరు ఓటేస్తారని ప్రశ్నించారు.