బీజేపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ

బీజేపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ

ఇటీవల ఎమ్మెల్సీ పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన అన్నం సతీష్‌ ప్రభాకర్‌ ఇవాళ బీజేపీలో చేరారు. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా.. అన్నం సతీష్‌కు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గుంటూరు జిల్లాకు చెందని సతీష్‌.. 2014 ఎన్నికల్లో బాపట్ల నుంచి వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకు చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 
టీడీపీకి రాజీనామా చేసిన సమయంలో సతీష్‌.. చంద్రబాబునాయుడు, లోకేష్‌లపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. లోకేష్‌ వల్లే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. పార్టీ మీద కానీ, పార్టీ నిర్మాణం మీద కానీ అవగాహన లేకపోయినా పార్టీని తన చేతుల్లోకి తీసుకునేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.