ఆ విమానాల్లో నల్లుల బెడద

ఆ విమానాల్లో నల్లుల బెడద

ఎయిర్ ఇండియాలో నల్లుల బెడద ప్రయాణీకులను హడలెత్తిస్తోంది. విమానాల్లో నల్లులు కుడుతున్నాయని  ప్రయాణీకులు ఫిర్యాదులు చేస్తున్నారు. పలు ఎయిర్ ఇండియా విమానాల్లో ఈ పరిస్థితి ఉందని ప్రయాణికుల నుంచి గతంలో ఫిర్యాదులు అందినా... సంస్థ నివారణకు చర్యలు తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి. గతంలో  ఢిల్లీ - బెంగళూరు విమానంలో నల్లుల బెడదతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డామని ఫిర్యాదులు చేసారు. జూలైలో బోయింగ్ 777విమానంలో నల్లుల బెడదపై ఎయిర్ ఇండియా రెండు  ఫిర్యాదులు అందాయి. తాజాగా డొమెస్టిక్ క్లాస్ ప్రయాణీకుడు ఫిర్యాదు చేశారు. డొమెస్టిక్ క్లాస్ ప్యాసెంజర్ ఫిర్యాదు చేయటం మాత్రం ఇదే మొదటిసారి.  విమానంలో ఉన్నంత సేపు తాను దురదతో తీవ్రంగా ఇబ్బంది పడ్డానని తాజాగా ఫిర్యాదు చేసిన వ్యక్తి తెలిపారు. మొదట్లో దోమలున్నాయని భావించానని తెలిపారు. అయితే.. ఇంటికి వచ్చిన తర్వాత చొక్కా విప్పి చూశానని అందులో నల్లులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.