ఎఫ్‌సీయూకే నుంచి మరో పాట..

ఎఫ్‌సీయూకే నుంచి మరో పాట..

జగపతి బాబు ప్రధాన పాత్రగా తెరకెక్కుతున్న సినిమా ఎఫ్‌సీయూకే(ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్). ఈ సినిమాలో అమ్ము అభిరామి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విద్య సాగర్ రాజు దర్శత్వంలో కేఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా అందరిని ఆకర్షించాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట విడుదల కానుందంట. పువ్వల్లే అంటూ సాగే ఈ పాట రేపు ఉదయం 9గంటలకు రిలీజ్ కానుంది. ఈ మేరకు సినిమా మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా నుంచి విడుదల అవుతున్న ఐదవ పాట ఇది. ఈ పాట కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా ఈ నెల12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి అభిమానుల్ని ఈ సినిమా ఎంతవరకు అరిస్తుందో వేచి చూడాలి.