మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్న నాగ చైతన్య

మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్న నాగ చైతన్య

నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా సవ్యసాచి.  నవంబర్ 2 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నది.  చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నడుతున్నది.  టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో.. ఇది మరింతగా పెరిగింది.  ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా ఏవీ లేవు.  నవంబర్ 6 వ తేదీన విజయ్ సర్కార్ సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఇది అనువాద సినిమా కావడంతో పెద్దగా పోటీ ఉండకపోవచ్చు.  

ఇదిలా ఉంటె, ఈరోజు రాత్రి 9 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ సర్ప్రైజ్ ను ఇవ్వబోతున్నట్టు తెలుస్తున్నది.  నాగచైతన్య కు చెందిన ఓ స్పెషల్ స్టిల్ ను రిలీజ్ చేస్తారని సమాచారం.  నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.