కొలంబోలో మరో పేలుడు.. ఇద్దరు మృతి

కొలంబోలో మరో పేలుడు.. ఇద్దరు మృతి

వరుస పేలుళ్లతో శ్రీలంక వణుకుతోంది. కొద్దిసేపటి క్రితం కొలంబోలో మరో పేలుడు సంభవించింది. డెమెటోగోడలో జరిగిన ఈ పేలుడులో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఇవాళ జరిగిన ఏడో పేలుడు ఇది. ఇక.. ఇవాళ జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య 167కి చేరింది. పేలుళ్ల వెనుక ఆత్మాహుతి దళాల పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్న శ్రీలంక ప్రభుత్వం.. ముందుజాగ్రత్తగా సైన్యాన్ని రంగంలోకి దించింది. దేశంలో హైఅలర్ట్ ప్రకటించింది.