కొలంబోలో మరో బాంబు పేలుడు

కొలంబోలో మరో బాంబు పేలుడు

వరుస బాంబుపేలుళ్లతో శ్రీలంక రాజధాని కొలంబో వణికిపోతోంది. బుధవారం ఉదయం సినిమా థియేటర్ వద్ద మరో పేలుడు సంభవించింది. మోటర్ బైక్ లో పేలుడు పదార్ధాలు ఉంచి పేల్చారు. ఈస్టర్‌ పర్వదినం రోజున జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 359కి చేరింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ దుండగుల కోసం జరుపుతున్న గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి మరో 18 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పవరకు పోలీసులు అరెస్టు చేసిన వారి సంఖ్య 58కి చేరింది. అలాగే మరిన్ని దాడులు జరిపేందుకు ముష్కరులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్న సమాచారం ఉందని.. అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ ప్రధాని రనిల్‌ విక్రమసింఘే పిలుపునిచ్చారు.