'ఐటీ గ్రిడ్స్‌'పై మరో కేసు..

'ఐటీ గ్రిడ్స్‌'పై మరో కేసు..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఐటీ గ్రిడ్స్‌పై మరో కేసు నమోదైంది. ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ నిర్వాహకులపై మరో కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని ఆధార్‌ రీజినల్‌ కార్యాలయ అధికారుల ఫిర్యాదు మేరకు మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు రిజిస్ట్రర్ చేశారు. ఐటీ గ్రిడ్‌ కార్యాలయంలో ఆధార్‌ సమాచారం దొరకడంపై వివరణ కోరుతూ ఈ కేసులో విచారణ జరుపుతోన్న సిట్‌ అధికారులు ఢిల్లీలోని యూఐడీఏఐ కేంద్ర కార్యాలయానికి లేఖ రాశారు. దీనికి స్పందించిన యూఐడీఏఐ అధికారులు హైదరాబాద్‌లోని ఆధార్‌ రీజినల్‌ కార్యాలయం ద్వారా మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆధార్‌కార్డు యాక్ట్‌లోని 37, 38, 40, 42, 44 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసును వెంటనే సిట్‌కు బదిలీ చేశారు.