ఐటీ గ్రిడ్స్‌పై మరో కేసు..

ఐటీ గ్రిడ్స్‌పై మరో కేసు..

ఐటీ గ్రిడ్స్‌పై మరో కేసు నమోదైంది.. సేవ మిత్ర అప్ పేరుతో ప్రభుత్వ లబ్ధిదారుల డేటాను చోరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఐటీ గ్రిడ్స్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ నేత రాంరెడ్డి ఈ ఫిర్యాదు చేశారు. సేవా మిత్ర యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల డేటాను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు వైసీపీ నేతలు. దీంతో కేసు నమోదు చేసిన ఎస్ఆర్ నగర్ పోలీసులు... ఐటీ గ్రిడ్‌పై విచారణ చేపట్టారు.