దుర్గగుడిలో మరో వివాదం

దుర్గగుడిలో మరో వివాదం

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మరో వివాదం చెలరేగింది. భక్తుల కోసం నిర్మించిన డార్మెటరీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో కలకలం రేగింది.  సీసీ కెమరాలుండడంతో మహిళలు దుస్తులు మార్చుకోవడానికి ఇబ్బందిగా ఉందని అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఐతే.. కెమెరాలున్నప్పటికీ వాటితో రికార్డు చేయడం లేదని అధికారులు చెప్పారు. మహిళల గదుల్లో సీసీ కెమెరాలు అమర్చడం పొరపాటేనని పాలకమండలి సభ్యులు అంగీకరించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.