మళ్లీ ఇసుక తుపానులు...

మళ్లీ ఇసుక తుపానులు...

రాజస్థాన్ లో ఇసుక తుపాను సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఈ ఘటన నుండి బయటపడకముందే.. ఉత్తర భారతదేశంలో పెనుగాలులతో కూడిన వర్షం పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే రెండు రోజుల్లో ఉత్తరాఖండ్‌, జమ్మూ కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు ప్రకటించింది. మరోవైపు రాజస్థాన్‌లో కూడా మళ్ళీ ఇసుక తుపాన్‌ సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమతీరంలోని మధ్యదరా సముద్రంలో ఏర్పడిన ఆకస్మిక మార్పుల కారణంగా పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణాదిలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాజస్థాన్ కు ఇసుక తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.