స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన అను ఇమ్మాన్యుయేల్ !

స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన అను ఇమ్మాన్యుయేల్ !

కెరీర్లో చెప్పుకోదగిన హిట్ లేకపోయినా అను ఇమ్మాన్యుయేల్ కు మంచి ఆఫర్లే వస్తున్నాయి.  తాజాగా తమిల్ స్టార్ హీరో ధనుష్ తాను దర్శకత్వం వహిస్తున్న రెండవ సినిమాలో కథానాయకిగా అను ఇమ్మాన్యుయేల్ ను చూజ్ చేసుకున్నాడట. 

శ్రీ తేనండాల్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించనున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమాలో నాగార్జున, ఎస్.జె.సూర్య, శరత్ కుమార్, శ్రీకాంత్, అదితిరావ్ హైదరీలు నటిస్తున్నారు.  ఈ ప్రాజెక్ట్ ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది.  త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది.