ఆర్ఆర్ఆర్ గురించి మరో ఊహాగానం

ఆర్ఆర్ఆర్ గురించి మరో ఊహాగానం

ఆర్ఆర్ఆర్ సినిమా సెకండ్ షెడ్యూల్ రీసెంట్ గా స్టార్ట్ అయింది.  ఈ షెడ్యూల్ లో హీరోలతో పాటు మరికొందరు కీలక నటులు పాల్గొంటున్నారు.  సముద్ర ఖనిని ఇప్పటికే యూనిట్ ఫిక్స్ చేయగా, హీరోయిన్లను ఇప్పటి వరకు ఫిక్స్ చేయలేదు.  అనేక పేర్లు వినిపిస్తున్నాయి.  తెలుగులో సినిమాలు చేసిన వారి పేర్లను పరిశీలిస్తున్నారు.  

తాజా పుకారు ప్రకారం, ఆర్ఆర్ఆర్ కోసం  బాలీవుడ్ కు చెందిన ఇద్దరి పేర్లను  పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.  అందులో ఒకటి జాన్వీ కపూర్, రెండోది సారా అలీఖాన్.  శ్రీదేవి ముద్దుల కూతురు కావడంతో పాటు బాలీవుడ్ లో ధఢక్ సినిమాతో మంచి హిట్ అందుకుంది.  అలాగే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి రీమేక్ చేసిన టెంపర్ సినిమా నటించిన సారా ఆలీఖాన్ ను కూడా ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్టు సమాచారం.  క్యాస్టింగ్ విషయాలను బాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ క్యాస్టింగ్ కంపెనీకి అప్పగించిన సంగతి తెలిసిందే.