కాజల్ కు పోటీగా మెహ్రీన్ !

కాజల్ కు పోటీగా మెహ్రీన్ !

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో ప్రధాన కథానాయకిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు ఈ చిత్రంలో మరొక నటి మెహ్రీన్ ప్రిజాద కూడా జాయిన్ అయింది.  అంటే స్క్రీన్ మీద ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు పోటీపడనున్నారన్నమాట.    

ఇలా ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నారు.  వంశధార క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.  ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానేలు కూడ నటిస్తున్నారు.  ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం కొంత చిత్రీకరణను పూర్తిచేసుకుంది.