నాగార్జున సినిమాలో మరో అందగత్తె !

నాగార్జున సినిమాలో మరో అందగత్తె !

నాగార్జున ప్రస్తుతం 'మన్మథుడు 2' సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది.  ఆమెతో పాటు మరో అందమైన హీరోయిన్ కూడా ఈ చిత్రంలో నటించనుంది.  ఆమే అక్షర గౌడ.  హిందీ, కన్నడ సినిమాల్లో నటించిన అక్షరకు ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం.  తన చేతిలో సినిమాలు ఉన్నా నాగార్జునగారితో నటించడం కోసమే ఈ సినిమాకు ఒప్పుకున్నానని, ఇందులో తన పాత్ర చాలా అందంగా, ఎంటెర్టైనింగా ఉంటుందని అక్షర అంటోంది.