బాలయ్య కోసం మరో హిట్ కథ సిద్ధంగా ఉందట..!!

బాలయ్య కోసం మరో హిట్ కథ సిద్ధంగా ఉందట..!!

బాలకృష్ణ తన హిట్స్ తో దూసుకుపోతున్నాడు.  ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ సినిమా బిజీలో ఉన్న బాలకృష్ణ, ఈ సినిమా పూర్తికాగానే బోయపాటితో సినిమా చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే.  ఇప్పటికే బోయపాటి ఓ పవర్ఫుల్ కథతో రెడీ గా ఉన్నాడు.  దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను ప్రముఖ రచయితా ఎమ్ రత్నం రెడీ చేస్తున్నాడు.  

పక్కా రాజకీయాలకు సంబంధించిన కథతో స్క్రిప్ట్ ఉంటుందట.  అంతేకాదు, సమాజంలో జరిగే అన్యాయాన్ని ఎదిరించే పాత్రలో బాలయ్యను చూపించబోతున్నాడట.  బాలకృష్ణ రాజకీయాలకు ఎంతగానో ఉపయోగపడే సినిమా అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్.  బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు ఎలాంటి హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.