‘గే’మ్ పూర్తైంది! ఇక డైవోర్స్ అంటోన్న హాలీవుడ్ జంట!

‘గే’మ్ పూర్తైంది! ఇక డైవోర్స్ అంటోన్న హాలీవుడ్ జంట!

హాలీవుడ్ సినిమాలే కాదు... హాలీవుడ్ నిజ జీవితాలు కూడా... షాకింగ్ గానే ఉంటాయి. అక్కడ పెళ్లైతే ఆశ్చర్యం. విడాకులైతే, అది కూడా ఆశ్చర్యమే. ఇక ఎవరైనా ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉంటే సైతం, హాలీవుడ్ వర్గాల్లో అది కూడా విడ్డూరమే! అయితే, ఇప్పుడు మరో పెళ్లి పెటాకులవ్వటానికి కౌంట్ డౌన్ మొదలైంది. కానీ, ఇది కాస్త డిఫరెంట్ డైవోర్స్! ఎలియాట్ పేజ్, ఎమ్మా పోర్ట్నర్... 2018 జనవరిలో పెళ్లి చేసుకున్నారు. 2017లో డేటింగ్ మొదలు పెట్టిన ఈ జంట రెండేళ్లకే విడాకులకి సిద్ధపడ్డట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అసలైతే ఎలియాట్, ఎమ్మా పోయిన వేసవి కాలం నుంచే విడివిడిగా ఉంటున్నారట. అందుకే, ఇక అధికారికంగా విడాకుల లాంఛనం పూర్తి చేయబోతున్నామని చెబుతున్నారు. ఇక పై కూడా మాకు ఇద్దరికీ పరస్పర గౌరవం, అభిమానం ఎప్పటిలాగే ఉంటాయని అభిమానులకి ప్రత్యేకంగా సెలవిచ్చారు. అయితే, వీళ్ల విడాకులు రొటీన్ కి భిన్నమైనవి. అందుకే, మన పనిగట్టుకుని ప్రస్తావించుకుంటున్నాం...
ఎలియాట్ పేజ్ ‘ఇన్సెప్షన్, ఎక్స్ మెన్’ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాల్లో నటించాడు. కానీ, ఈయన 2014లో ‘నేను గే’నంటూ బాంబు పేల్చాడు. అప్పుడు ప్రొఫెషనల్ డ్యాన్సర్ అయిన ఎమ్మా పూర్తి మద్దతు ఇచ్చింది. అలా ఎలియాట్ తో ఆమె గే రిలేషన్ మొదలైంది. అది 2018లో పాకాన పడి పాణిగ్రహణం దాకా వెళ్లింది. ఎలియాట్, ఎమ్మా గే మ్యారేజ్ అప్పట్లో అందర్నీ ఆకట్టుకుంది. అయితే, రెండేళ్లు పూర్తి కాగానే వీరిద్దరూ డైవోర్స్ కి రెడీ అవ్వటం చాలా మందిని షాక్ కి గురి చేస్తోంది. కాకపోతే, హాలీవుడ్ డైవోర్స్ లు ఎవరు ఆగమన్నా ఆగవు కదా? త్వరలోనే ఎలియాట్ కు ఎమ్మా గుడ్ బై చెప్పబోతోంది! చూడాలి మరి... వాట్ నెక్ట్స్...