అల వైకుంఠపురంలో మరో కీలక అప్డేట్.. 

అల వైకుంఠపురంలో మరో కీలక అప్డేట్.. 

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా  అలవైకుంఠపురంలో.. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు.  ఈ రెండు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.  సామజవరగమన సాంగ్ టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక లైకులు సొంతం చేసుకున్న సాంగ్ గా పేరు తెచ్చుకుంది.  దీని తరువాత వచ్చిన రాములో రాములా సాంగ్ బంపర్ హిట్ కొట్టింది.  

కాగా, ఈ మూవీలోని మూడో సింగిల్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు.  మూడో సింగ్ కు ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనే విషయాలను ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు తెలియజేయబోతున్నట్టు అలవైకుంఠపురంలో నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిక పేర్కొన్నది.  ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ కాగా, టబు ప్రత్యేక పాత్రలో నటిస్తోంది.  థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.