ఆర్ఆర్ఆర్ నుంచి మరో అప్డేట్

ఆర్ఆర్ఆర్ నుంచి మరో అప్డేట్

ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న సంగతి తెలిసిందే.  రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు సంబంధించిన కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించి కీరవాణి ఇప్పటికే మ్యూజిక్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.  కీరవాణి కొన్ని కీలకమైన బాణీలు ఇచ్చినట్టు తెలుస్తోంది.  ప్రముఖ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ రాస్తున్నట్టు సమాచారం.  

మార్చి 14 వ తేదీన ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన ప్రెస్ మీట్ ను రాజమౌళి నిర్వహిస్తున్నారు.  ఈ ప్రెస్ మీట్ లో కీలకమైన విషయాలను మీడియాతో పంచుకోబోతున్నారు.  డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ కాబోతున్నది.