వరల్డ్‌కప్‌లో క్రిస్‌ గేల్‌ మరో రికార్డు

వరల్డ్‌కప్‌లో క్రిస్‌ గేల్‌ మరో రికార్డు

'యూనివర్సల్ బాస్' క్రిస్‌ గేల్‌ మరో రికార్డు నెలకొల్పాడు. వరల్డ్‌ కప్‌ మెగా టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు సౌతాఫ్రికా ఆటగాడు డివిలియర్స్‌ పేరు మీదున్న రికార్డును తిరగరాశాడు. ఇవాళ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు సిక్సర్లు కొట్టిన గేల్‌.. వరల్డ్‌కప్‌ చరిత్రలో మొత్తం 39 సిక్సర్లతో టాప్‌ ప్లేస్‌ను దక్కించుకున్నాడు. ఈ జాబితాను పరిశీలిస్తే.. క్రిస్‌ గేల్‌ 39 సిక్సర్లతో అగ్రభాగాన ఉండగా ఆ తరువాత స్థానాల్లో డివిలియర్స్(37), పాంటింగ్‌(31), బ్రెండన్ మెక్‌కలమ్(29), గిబ్స్(28), సనత్ జయసూర్య/ సచిన్ టెండూల్కర్(27) ఉన్నారు. ఇక.. వన్డేల్లో ఇప్పటి వరకు గేల్‌ 316 సిక్సర్లు కొట్టాడు.