ఏపీలో రైతుల కోసం మరో పథకం..

ఏపీలో రైతుల కోసం మరో పథకం..

రైతుల కోసం ఏపీ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రవేశ పెడుతోంది. త్వరలో త్వరలో 'అన్నదాతా సుఖీభవ' పథకాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం చంద్రబాబునాయుడు ఇవాళ అసెంబ్లీలో చెప్పారు. ఉద్యాన రంగంలో తక్కువ ఖర్చుతో ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమకూరుతోందన్న ఆయన.. ఈ రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో కోటి ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని బాబు చెప్పారు. ఇక.. త్వరలో ప్రారంభమవనున్న 'అన్నదాతా సుఖీభవ' పథకానికి మంత్రి యనమల ఇవాళ్టి బడ్జెట్‌లో రూ.5000 కోట్లు కేటాయించారు.