మరో స్మార్ట్ ఫోన్‌ వచ్చేస్తోంది

మరో స్మార్ట్ ఫోన్‌ వచ్చేస్తోంది

ఇపుడు మన మార్కెట్‌ను ముంచేత్తేందుకు మరో స్మార్ట్‌ ఫోన్‌ రెడీ అవుతోంది. ఇప్పటికే చైనా కంపెనీల ఫోన్లు హోరెత్తించగా.. ఇపుడు వియత్నాంకు చెందిన మొబిస్టార్‌ మొబైల్‌ ఫోన్లు దేశంలో ప్రవేశించేందుకు రెడీ అవుతున్నాయి. ఓప్పొ, వివో, షియోమీ కంపెనీలో పోటీగా తమ ఉత్పులను ఈ నెలాఖరులో ప్రవేశపెడుతున్నామని మొబిస్టార్‌ వెల్లడించింది. అంతర్జాతీయ కార్యకలాపాలకు భారత్‌ను ప్రధాన కార్యాలయంగా చేసుకుని విస్తరిస్తామని ఆ కంపెనీ పేర్కొంది. దేశీయంగా ఫోన్ల తయారీ కోసం వి సన్‌ టెక్నాలజీస్‌తో తాము ఒప్పందం కుదుర్చుకున్నామని కంపెనీ వెల్లడించింది. ఆన్‌లైన్‌లో తాము అమ్మకాలు ప్రారంభిస్తామని... ధర రూ.6000 నుంచి రూ. 10,000 మధ్య ఉంటుందని మొబిస్టార్‌ పేర్కొంది.