ఓటీటీ బాట పట్టిన మరో స్టార్ హీరో సినిమా

 ఓటీటీ బాట పట్టిన మరో స్టార్ హీరో సినిమా

బాలీవుడ్ అగ్ర హీరోల్లో అక్షయ్ కుమార్ కచ్చితంగా ఉంటాడు. అక్షయ్ ఇటీవల చేసిన నూతన చిత్రం ఓటీటీ బాట పట్టనుందట. గతేడాది దీపావళికి అక్షయ్ లక్మీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను హాట్ స్టార్‌లో రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా నుంచి అనుకున్నంత స్పందన అందలేదు. దాని తరువాత నిర్మాతగా భాగమతి సినిమాను తెరకెక్కించాడు. ఇది కూడా నిరాశ పరిచింది. ఈ సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పటి నుంచే అక్షయ్ ఓ స్పై థ్రిల్లర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు బెల్ బాటమ్ అని పేరును ఖరారు చేశారు. దీనిని దర్శకుడు రంజిత్ తివారి రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు అమెజాన్ ప్రైమ్‌తో చర్చలు జరపుతున్నారు. ఒకవేళ ఈ చర్చలు పూర్తయితే ఈ సినిమా ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌గా విడుదల కానుంది. అమెజాన్ ఇచ్చిన ఆఫర్‌కు సినిమా నిర్మాతలు టెంప్ట్ అయినట్లున్నారు. అయితే ఆఫర్ ఇంకాస్త పెరిగితే బాగుంటుందని వారు ఆశిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌పై వచ్చే నెల స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా ఏప్రిల్‌2న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు అది జరిగేలా కనిపించడం లేదు. దాంతో ఈ సినిమా ఎప్పుడు ఎందులో విడుదలవుతుందని అభిమానులు వేచి చూస్తున్నారు.