ప్రయోగం చేసేందుకు రెడీ అవుతున్న స్టార్ హీరో 

ప్రయోగం చేసేందుకు రెడీ అవుతున్న స్టార్ హీరో 

విశ్వనటుడు కమల్ హాసన్ నటన గురించి చెప్పాలంటే మాటలకు కరువవుతాయి. అతడి కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు చేశాడు. వాటిలో పుష్పక విమానం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ సినిమా మూకీ కేటగిరీలో విడుదలై సంచలనాలు సృష్టించింది. మాటలు లేకుండా కూడా ప్రేక్షకులకు అన్నింటిని అలరించారు. ఈ సినిమాని లెజెండ్రీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావుగారు దర్శకత్వం చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల గుండెల్లో మరువలేని మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఇప్పుడు అదే తరహాలో మరో తమిళ నటుడు ప్రయోగం చేయనున్నాడు. అదెవరో కాదండీ తమిళ నాట స్టార్ హీరోగానే కాకుండా విలక్షణ నటుడిగా కూడా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి. ఈ సినిమాకి గాంధీ టాక్స్ అనే పేరుని ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్‌ను విజయ్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేశారు. ఈ సినిమాకు నిశ్శబ్ద యుగాన్ని మరోసారి సెలబ్రేట్ చేద్దాం అనేది దీని ట్యాగ్ లైన్. ఈ సినిమా పోస్టర్ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ పోస్టర్ షేర్ చేసిన విజయ్ దీనికి మరో ఆసక్తికర వ్యాక్యాన్ని జోడించాడు. ‘కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దం చాలా బిగ్గరగా ఉంటుంద’ని రాసుకొచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా విజయ్ కెరీర్‌లో ఎంతటి పేరును సంపాదిస్తుందో చూడాలి.