భారతీయుడు 2 లో మరో స్టార్ హీరో..!!

భారతీయుడు 2 లో మరో స్టార్ హీరో..!!

2 పాయింట్ 0 మరొకొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత శంకర్ భారతీయుడు 2 సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళబోతున్నాడు.  ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది.  మూడు రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ముగిశాయి.  కమల్ హాసన్ మెయిన్ రోల్ చేస్తుండగా మలయాళం స్టార్ హీరో దుల్క్యూర్ సల్మాన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు.  

ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.  భారతీయుడు 2 లో తమిళ స్టార్ నటుడు శింబు కూడా నటిస్తున్నట్టు తెలుస్తున్నది.  భారతీయుడు 2 సినిమాకు సైన్ చేసినట్టుగా తమిళ సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి.  ఎలాంటి పాత్ర చేస్తున్నాడు అన్నది అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది.  హీరోయిన్లు ఎవరు అనే విషయం కూడా ఇంకా బయటకు రాలేదు.  అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.