పాకిస్తాన్‌లో మరో దారుణం..ఆరుగురు కలిసి..

పాకిస్తాన్‌లో మరో దారుణం..ఆరుగురు కలిసి..

ఫైసలాబాద్: పాకీస్తాన్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. పెళ్ళి చేసుకోవాలంటూ మైనర్ బాలికపై అఘాయిత్యం. ఈ ఘాతుకం పాకీస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆరుగురు వ్యక్తులు కలిసి ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేశారు. అయితే ఆమెపై ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడలేదు. కానీ మరో 45 సంవత్సరాల వ్యక్తిని వివాహం చేసుకోవాలని బలవంతం చేశారు. అయితే కూతురు కనిపించకపోవడంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆగంతుకలను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసును నమోదు చేశారు. కానీ అమ్మాయి వయసు 17సంవత్సరాలుగా ఉండటంపై విచారణ జరపాలని కోర్టు తెలిపింది. దాంతో ఆమె తండ్రి దోషులపై చర్యలు తీసుకోవాలని పైస్థాయి అధికారుల వద్దకు వెళ్లాడు. అంతేకాకుండా పోలీసులను నుంచి సరైన సహకారం అందలేదని కూడా ఫిర్యాదు చేశాడు. అయితే పాకీస్తాన్‌లో కేవలం అతి కొద్ది రోజులలో ఇటువంటివి జరగడం ఇది రెండో సారి. ఇటీవల 13 సంవత్సరాల క్రైస్తమ అమ్మాయి అర్జూ రాజాను కిడ్నాప్ చేసి కరాచీకి చెందిన 44సంవత్సారాల వ్యక్తిని పెళ్ళి చేసుకోన్నారు. ఆ తరువాత ఆమెను ఇస్లాంలోకి మార్చేశారు. పలు మానవహక్కు సంఘాలు రాజాకు న్యాయం జరగాలని కోరాయి. మరి ఈ కేసును కోర్టు ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి.