మరో మూడు రోజులు వర్షాలు..!

మరో మూడు రోజులు వర్షాలు..!

ఇప్పటికే భారీ వర్షాలతో జనం అతలాకుతలం అవుతున్నారు.. మరోవైపు మరో మూడు రోజులు వర్షాలు తప్పవంటున్నారు వాతావరణ శాఖ అధికారులు... ఆదివారం రోజు హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.. ముఖ్యంగా దసరా పండగకి ఊళ్లకు వెళ్లేవారు.. ఓవైపు బస్సులు కూడా లేకపోవడంతో నరకం చూడాల్సి వచ్చింది. ఇక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం కూడా అక్కడక్కడా భారీ వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు. మంగళవారం, బుధవారాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి కోస్తా కర్ణాటక వరకూ తెలంగాణ, మధ్య కర్ణాటకల మీదుగా 1.5 కి.మీ.ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుండడంతో దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.