వరుణ్ తేజ్ వాల్మీకి నుంచి మరో ట్విస్ట్

వరుణ్ తేజ్ వాల్మీకి నుంచి మరో ట్విస్ట్

ఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా వాల్మీకి.  పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ వంటి మెగా హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు.  తమిళంలో సూపర్ హిట్టైన జిగర్తాండ సినిమాకు ఇది రీమేక్.  బాబీ సింహా చేసిన పాత్రను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు.  రీసెంట్ గా ప్రారంభమైన ఈ సినిమా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తోంది.  

మొదట ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ అనుకున్నారు.  అయితే, పూజా హెగ్డే రెమ్యునరేషన్ విషయంలో కొన్ని పట్టింపులు రావడంతో పూజా పక్కకు తప్పుకుందని వార్తలు వస్తున్నాయి.  ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలి.  మరో ట్విస్ట్ ఏమంటే మ్యూజిక్ డైరెక్టర్.  మొదట దేవిశ్రీని మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నారు.  కానీ, కొన్ని సాంకేతిక కారణాల వలన దేవిశ్రీని పక్కన పెట్టి మిక్కీ జె మేయర్ ను లైన్లోకి తీసుకొచ్చారు.  తమిళంలో జిగర్తాండ పక్కా మాస్ సినిమా.. ఇలాంటి సినిమాకు క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ ఎలాంటి సంగీతం అందిస్తారో చూడాలి.